L Ramana on GHMC Election results 2020 | Oneindia telugu

2020-12-06 238

TDP Telangana state president L Ramana spoke on the results along with the TDP's contest in the Greater elections.

#GHMCElections2020
#TDPTelanganastatepresidentLRamana
#LRamanaonGHMCresults
#TDP
#BJP
#TRS
#ChandrababuNaidu
#Hyderabad

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి ఘోర ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్థులు ఎవరూ పోటీ చేసిన చోట డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ , గ్రేటర్ హైదరాబాద్ లోనూ ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఈ ఎన్నికలలో పూర్తిగా చతికిలబడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడాన్ని చాలా మంది అవహేళన చేస్తున్నారు. నీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది అని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయడంతో పాటుగా ఫలితాలపై మాట్లాడారు టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్లు టీడీపీని ఆదరించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రమణ ముప్పై సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు కూడా టిక్కెట్లు ఇచ్చామని పేర్కొన్నారు .పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్ళినా ప్రజల నుంచి ఆదరణ కరువైంది అన్నారు.